Tuesday, 7 October 2014

1. నీ ప్రేమ బాణం తగలనేల 
   నా గుండె చిల్లు పడనేలా  

2. స్పందించగలనా  నీప్రేమకు 
    అనుక్షణం నాలోనే అది ఉంటుంటే 

3.టెలిఫోను సుందరి మాటలకేనా 
   ఒక్కసారి కనపడి వెల్లొచ్చుగా 

4. నీకన్నె సొగసుల అమరత్వంలో
   తుమ్మెదనై జన్మించాలని ఉంది

5. జన్మలలో జన్మనై
   ఎదురుచూస్తుంటా పునర్జన్మనై

6.  స్వప్నానికి స్వాగతమిస్తున్నా
    ఇంకా స్వప్నించమంటూ అది ఆజ్ఞాపిస్తుంది

7. నా ఊహలు వెండిమబ్బులై 
    నా ఊపిరి వర్షపుచినుకులై 

8.  కలలు కల్లోలమే
    నీ మది దుండు దగ్గర లేకుంటే 

9.  నిన్ను పెళ్ళాడినాకే కదా !
    ఆషాడం నాకు పరిచయమయింది 

10. కనువిందు అంటే 
     నీ అందాన్ని కనుగోన్నాకే తెలిసింది


11.  నొప్పి అంటే ఏంటో తెలుస్తుంది 
      నీ మౌనం నా మనసుతో ఆడుకుంటుంటే

12.  మనసు దూరాల నడుమ 
       విరహం వికటిస్తుంది ఆహ్వానిస్తూ 

13. కళ్లు కౌగిలించుకుంటున్నాయి
     చూపులను విసురుకుంటూ

14. గుప్పెడు గుండె చాలదా చెలీ
      ఉప్పెన లాంటి ప్రేమను తెలియచెప్పటానికి 

15. గ్రంధాలను చదవనవసరంలేదు

      నీ సొగసు గంధాలను పొందటానికి

16. నా  కళ్ళలోనుంచి నీల్లోచ్చినా పర్లేదు 
      నీ కళ్ళలో నీళ్ళు 

No comments:

Post a Comment